
బాపట్ల జిల్లా:- వైసీపీ కేంద్ర కార్యాలయంలో జిల్లా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున అధ్యక్షత వహించగా, పార్టీ నూతనంగా నియమించిన జిల్లా టాస్క్ ఫోర్స్ అబ్జర్వర్ బత్తుల బ్రహ్మారెడ్డి, సెంట్రల్ పార్టీ పొలిటికల్ కోఆర్డినేటర్ కందుల రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సమావేశాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.

ఈ సమావేశంలో
🔹 చీరాల వైసీపీ ఇన్చార్జ్ కరణం వెంకటేష్
🔹 వేమూరు ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబు
🔹 రేపల్లె ఇన్చార్జ్ ఈ ఊరి గణేష్ బాబు
🔹 పర్చూరు ఇన్చార్జ్ గాదే మధుసూదన్ రెడ్డి
🔹 రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు సమర్థవంతంగా తీసుకెళ్లడం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన ఉద్యమాలు, కార్యక్రమాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.Bapatla Local News
అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలన్న అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబు వేమూరులో పార్టీని ఏ విధంగా పటిష్టంగా నిర్మించామన్న విషయాన్ని సవివరంగా వివరించారు. సమావేశం ఉత్సాహభరితంగా కొనసాగి, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.










