AP POLITICAL NEWS – BUDGET IN ASSEMBLY రూ. 3 లక్షల 22 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
AP BUDGET IN ASSEMBLY
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కార్ తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 22 వేల 359 కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటింది. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో 3 లక్షల కోట్లు దాటింది. రెవెన్యూ వ్యయం 2 లక్షల 51 వేల 162 కోట్లు కాగా రెవెన్యూ లోటు 33,185 కోట్లు ఉంది. ద్రవ్య లోటు 79, 926 కోట్లు ఉంది. మూల ధన వ్యయం 40,635 కోట్లు గా ఉంది. ఇందులో భాగంగా శాఖల వారీగా కేటాయింపు ఇలా ఉన్నాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు,
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.18,847 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు, గృహనిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు, జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు, ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు,
ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు, యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు, గృహ మంత్రిత్వశాఖకు రూ.8,570 కోట్లు, తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు, మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు,
అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, పోలవరం కోసం రూ.6,705 కోట్లు, జల్‌జీవన్ మిషన్ కోసం రూ.2800 కోట్లు, తల్లికివందనం కోసం రూ.9,407 కోట్లు కేటాయించారు.