
చలపతి అధినేత వై వి ఆంజనేయులు
చలపతి మోతడకలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి పండుగ ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక నిలుస్తోందని చలపతి విద్యా సంస్థల అధినేత వై వి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోతడక లో ముందస్తు సంక్రాంతి సంబరాలు రంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

ముందుగా వేకువ జామున కళాశాల ఆవరణలో భోగి మంటలు వేసి, భోగి మంటలు చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు.వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు అధ్యాపకులు సమిష్టిగా పోటాపోటీగా ఏర్పాటు చేసిన సంక్రాంతి స్టాల్స్ ను ప్రత్యేకంగా చైర్మన్ దంపతులు పర్యవేక్షించి, గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారనీ విద్యార్థులను,వారికి సహకరించిన అధ్యాపకులను అభినందించి వారితో కలిసి ఫొటోలు దిగారు. క్రీడా ప్రాంగణంలో ముగ్గుల పోటీలు,రంగు రంగుల గాలి పటాల పోటీలలో పాల్గోని గాలి పటాలను స్వయంగా చైర్మన్ వేగుర వేసి విద్యార్థులను ఉత్సాహపరిచారు. chalapathi institute of engineering and technologyచలపతి ఇంజినీరింగ్ కాలేజీలో టెక్ ఫెస్ట్ ఘనంగా

కళాశాల ఆవరణలో 40 అడుగులతో ఏర్పాటు చేసిన ప్రభ ను చైర్మన్ దంపతులు సంప్రదాయ పద్ధతులతో లాంఛనంగా పూజలు నిర్వహించి ఏర్పాటు చేశారు. విద్యార్థుల కేరింతల మధ్య కోడి పుంజులతో సరదాగా కోడి పందేలు నిర్వహించారు. చైర్మన్ కోడి పుంజుతో ప్రిన్సిపాల్ కోడి పుంజు హోరాహోరీగా పోటీ పడ్డాయి. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులుతో నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో భాగంగా కోలాటం, భజన,పోక్ డాన్స్ వంటి కార్యక్రమాలు ప్రత్యక్షంగా వీక్షించించి ప్రత్యేకంగా అభినందించారు. హరిదాస్ వేషధారణతో ఓ విద్యార్థి కళాశాల ప్రాంగణం అంతా కలియతిరుగుతూ సందడి చేశారు.

ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఆశీర్వచనాలు అందుకున్నారు. సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని వివిధ క్రీడా సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు చైర్మన్ దంపతులు వై వి ఆంజనేయులు, వై అనంత కుమారిల చేతులమీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డి వినయ్ కుమార్, ప్రిన్సిపాల్ డా కొల్లా నాగ శ్రీనివాసరావు, డీన్ అడ్మిషన్ అండ్ ఆపరేషన్స్ డా. కె కిరణ్ కుమార్, డీన్ ఆఫ్ రీసెర్చ్ బాల మురళి కృష్ణ, డీన్ ఆఫ్ ఎగ్జామ్స్ డా వి వి సుబ్బారావు, విభాగాధిపతులు డా రవి కిరణ్, డా. తులసి రాణి, డా.రత్న బాబు,డా కళ్యాణ్ కుమార్, వి సాయి శ్రీనివాస్, జి రామచంద్రరావు, డి శంకరావు, శ్రీకాంత్, గాంధీ, హనుమంత్ నాయక్, పాలిటెక్నిక్ బాధ్యులు రమేష్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.











