
Bapatla:చీరాల:- పట్టణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అలిన్‌కో ఫౌండేషన్ సహకారంతో దివ్యాంగులకు ఉపకరణాల నమోదు శిబిరాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు హాజరై తమ వివరాలను నమోదు చేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీరాల శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారు హాజరై మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు అవసరమైన అన్ని రకాల ఉపకరణాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాయని అన్నారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బాపట్ల జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి శ్రీమతి సువార్త మేడం మాట్లాడుతూ, అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.Chirala Local News
ఈ సందర్భంగా భావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు శ్రీ గోగన ఆదిశేషు మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పిట్ల శ్రీనివాస్ రెడ్డి, నవ్యాంధ్ర దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ షేక్ కలిశా మాట్లాడుతూ దివ్యాంగులకు సమాన అవకాశాలు, సముచిత గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ శిబిరంలో వివిధ దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శిబిరం ద్వారా అర్హులైన దివ్యాంగులకు త్వరలో అవసరమైన ఉపకరణాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.










