
జగ్గయ్యపేట:-జగ్గయ్యపేట రవాణా శాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జగ్గయ్యపేట పట్టణం, చిల్లకల్లు కేంద్రంగా విస్తృత ప్రచార కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ యం.వి.ఎన్. నారాయణ రాజు పాల్గొని ప్రజలకు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని స్పష్టం చేశారు. వాహనాలకు సంబంధించిన అన్ని కాగితాలు ఫోర్స్‌లో ఉండేలా చూసుకోవాలని, డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని తెలిపారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధం అని, మైనర్లు వాహనాలను వేగంగా నడిపి ప్రమాదాలకు గురైతే, వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా పెద్దలే శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా కాకీ చొక్కా ధరించి, వాహనానికి సంబంధించిన అన్ని కాగితాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఫోర్స్‌లో ఉంచుకోవాలని సూచించారు.NTR VIJAYAWADA News
కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని, ప్రమాదాలను నివారించాలంటే ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించి, సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మోటర్ వెహికల్ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పొందారు.










