chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala Local News :-రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో సెయింట్‌ ఆన్స్‌ విద్యార్థుల జైత్రయాత్ర

చీరాల:= సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి, చీరాల విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో సత్తా చాటారు. యస్‌.ఆర్‌.కె.ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజి, భీమవరం వేదికగా నిర్వహించిన జైత్రా–2026 వేడుకల సందర్భంగా జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో పురుషులూ, మహిళలూ విభాగాల్లో సెయింట్‌ ఆన్స్‌ జట్లు విజేతలుగా నిలిచాయని కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు మరియు కరస్పాండెంట్‌ యస్‌. లక్ష్మణరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డా|| కె. జగదీష్‌ బాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా బలమైన పోటీ మధ్య సెయింట్‌ ఆన్స్‌ జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి రెండు విభాగాల్లోనూ విజయం సాధించడం గర్వకారణమని అన్నారు.

పురుషుల విభాగంలో 20 కళాశాలల జట్లు పాల్గొనగా, ఫైనల్స్‌లో స్వర్ణాంద్ర ఇంజినీరింగ్‌ కాలేజ్‌, నర్సపూర్‌ జట్టును ఓడించి సెయింట్‌ ఆన్స్‌ జట్టు విన్నర్స్‌గా నిలిచింది. ఈ జట్టులో ఆర్‌. రమణ, జి.వి.ఆర్‌. తేజా రెడ్డి, రాజారత్నం, జి. మైకేల్‌, కె. డాని, కె. సాయి కుమార్‌, నవీన్‌, ఆదిత్య, డేని వెంకట మణి కుమార్‌ పాల్గొన్నారు.Bapatla Local News

మహిళల విభాగంలో 16 కళాశాలల జట్లతో పోటీ పడి, ఫైనల్స్‌లో శ్రీ విష్ణు ఇంజినీరింగ్‌ కాలేజ్‌ జట్టుపై గెలుపొందింది. ఈ జట్టులో కె. అనిత, కె. ఉమా మహేశ్వరి, నిషిత, భూమిక, సుష్మ, మానస, హారిక, ప్రవల్లిక, స్రవంతి, రిక్కిల సభ్యులుగా ఉన్నారు.

ఈ విజయానికి మార్గనిర్దేశం చేసిన కళాశాల వ్యాయామ అధ్యాపకులు అన్నం శ్రీనివాసరావుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

విజయోత్సవంగా నిర్వహించిన అభినందన సభలో అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ శ్రీ ఆర్‌.వి. రమణమూర్తి, డైరెక్టర్‌ (అక్రిడిటేషన్స్‌) డా|| సి. సుబ్బారావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వాలీబాల్‌ జట్లకు హర్షాతిరేక అభినందనలు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker