
గుంటూరు:జనవరి 10:-సరస్ మేళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం రాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్, భోజనశాలలు, ఫుడ్ కోర్టు, త్రాగునీటి పంపులను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, నిర్వాహకులతో నేరుగా మాట్లాడి వారి నుండి ఫీడ్‌బ్యాక్ సేకరించారు.

స్టాల్స్ నిర్వహణ, శుభ్రత, భోజన నాణ్యత, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
విధులు కేటాయించిన అధికారులు అందరూ నిరంతర అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, మేళాకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్టాల్స్ నిర్వహణ, భద్రత, త్రాగునీరు, పారిశుద్ధ్యం అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

శనివారం నుంచే మేళాకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారని, రానున్న రోజుల్లో ఈ రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున, దానికి అనుగుణంగా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రతకు ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టంచేశారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల అధికారి కోమలి పద్మ, ఏపీడీ అశోక్ కుమార్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.GUNTUR NEWS
సరస్ మేళా విజయవంతంగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.










