

ప్రశాంత రాజు మృతి పట్ల
ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సంతాపం
ప్రజా సమస్యలపై స్పందిస్తూ, కనువిప్పు కలిగిస్తూ,
తన కలాన్ని కదిలిస్తూ పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న విశాలాంధ్ర జిల్లా ప్రతినిధి ప్రశాంత్ రాజు మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు సంతాపం ప్రకటించారు.
అక్షర ప్రస్థానం లో అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజాతంత్ర ఉద్యమాలకు ఊపిరి పోసే ఎన్నో కథనాలను అందించిన ఆయన పత్రికా రంగంలో ఒక మంచి జర్నలిస్టుగా రాణిస్తున్నారని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కొనియాడారు. ఒక మంచి భవిష్యత్తు ఉన్న ప్రశాంత్ రాజు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటం బాధ కలిగించిందని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రశాంత్ రాజు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు







