

సంక్రాంతి పండుగ సందర్భంగా వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జూదం, కోడి పందాలు, గుండాట తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ పి. భాగ్యరాజు గారు హెచ్చరించారు.
కోడి పందేలు, జూదం జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జూదం, కోడి పందాలు, అక్రమ మద్యం విక్రయాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టువర్ట్పురం, వెదుళ్ళపల్లి, కొత్తపాలెం, మురుకొండపాడు, జిల్లెలమూడి గ్రామాలలో జూదం మరియు కోడి పందాలు పూర్తిగా నిషేధించబడ్డాయని తెలిపారు. కోడి పందేల నిర్వహణకు స్థలాలు ఇచ్చిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఎవరైనా జూదం లేదా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే 9440900869 నంబర్‌కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ గారు తెలిపారు.







