

Janasena Mohith బాపట్ల పట్టణం 17.వ వార్డు అక్బర్ పేటలోని జనసేన అభిమాని కత్తుల మోహిత్ ఇటీవల మృతి చెందాడు. ఈరోజు మోహిత్ దిశ దిన కర్మ కార్యక్రమంలో బాపట్ల జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్ పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.







