
బాపట్ల జిల్లా
వేమూరు నియోజకవర్గం
వేమూరు రిపోర్టర్ రవిబాబు

Vemuru Sankranti తెలుగుజాతి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు, సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా ప్రతి కుటుంబం సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారన్నారు, మారుతున్న కాలానుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయని వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు, వేమూరులో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలు సంప్రదాయాలను ఉట్టిపడే రీతిలో నిర్వహించటం అభినందనీయమన్నారు, ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు, ముందుగా చావలి రోడ్డు నుండి ఎడ్ల బండి పై ఊరేగింపుగా పుర వేదిక వరకు తోడుకొని వచ్చారు అనంతరం నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు, సంక్రాంతి సంబరాలు సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు, కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, టిడిపి నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మండల పార్టీ అధ్యక్షులు గాజుల వెంకటసుబ్బయ్య, వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, తూనుగుంట్ల సాయిబాబా, దుప్పలపూడి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.








