chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

AP LATEST NEWS: సరస్ మేళా కు ప్రజల నుంచి అనూహ్య స్పందన – 12 లక్షలకు పైగా ప్రజలు సందర్శన

SARAS MELA IN GUNTUR

గుంటూరులో ఏర్పాటు చేసిన సరస్ మేళా ఆదివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లపై సందర్శకులు పూర్తి సంతృప్తి చెందారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యుల కళా నైపుణ్యం, వ్యాపార దక్షతను ప్రతిబింబించేలా నల్లపాడు రోడ్డు రెడ్డి కళాశాల సమీపంలో  జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ కు ప్రజల నుంచి  అనుహ్య స్పందన లభిస్తుంది. జనవరి ఆరవ తేదీ నుంచి సరస్ మేళాలో అమ్మకాలు ప్రారంభవగా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనవరి 8వ తేదిన కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర సెర్ప్, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులతో 12 ఎకరాల విస్తీర్ణంలో 300 పైగా స్టాల్స్ ను సరస్ మేళా లో ఏర్పాటు చేశారు.  రాష్ట్రం తో పాటు దేశంలోని  అన్ని ప్రాంతాలకు చెందిన  ఉడ్, మెటల్ , క్లే, జ్యూట్, బ్యాంబు , లీవ్స్, గ్రాస్ తో తయారుచేసి హ్యాండీ క్రాఫ్ట్స్, కాటన్, పట్టు , కలంకారీ, ఎంబ్రాయిడరీ, లేస్ , ప్రింటెడ్ హ్యాండ్లూమ్స్ చీరెలు, డ్రెస్ మెటీరియల్, షర్టింగ్, ఇతర వస్త్రాలు సరసమైన ధరలకు లభ్యమటంతో రోజురోజుకి సందర్శకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. వీటితోపాటు చిరుధాన్యాలతో తయారుచేసిన పిండివంటలు, పూతరేకులు,హల్వా, ఆర్గానిక్ ఆహార పదార్థాలు, నిత్యవసర సరుకులు, ఆయుర్వేద, హెర్బల్ మందులు, పౌడర్లు మేళాలో ఉన్నాయి. జనవరి 6న ప్రారంభమైన మేళాలో గురువారం నాటికి సుమారు 12 లక్షలకు పైగా ప్రజలు సందర్శించారు. మేళాను సెలవు రోజులైన జనవరి 10,11,14,15 తేదీలలో ప్రతిరోజు లక్షకుపైగానే ప్రజలు సందర్శించారు. విద్యాసంస్థలకు సెలవులు, పండుగ రోజులు కావడంతో గుంటూరు జిల్లా తో పాటు ఎన్టీఆర్, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం ఇతర జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా మేళాను సందర్శించారు. ఫుడ్ కోర్ట్ లైవ్ కిచెన్ లో  అందిస్తున్న విభిన్న రాష్ట్రాలకు చెందిన వెజ్ , నాన్ వెజ్ వంటకాల రుచులు కోసం ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎంమ్యూజ్మెంట్ పార్కులో  ఆటవస్తువులు వలన ఎక్కువమంది చిన్న పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా మేళాను సందర్శిస్తున్నారు.  *ఆదివారం తో ముగియనునున్న సరస్ మేళా* జనవరి ఆరవ తేదీన ప్రారంభమైన సరస్ మేళా, అఖిలభారత డ్వాక్రా బజార్ జనవరి 18వ తేదీ ఆదివారం తో ముగియనున్నాది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సరస్ మేళా  తెరిచి ఉంటుంది. *ఏర్పాట్లపై సందర్శకులు పూర్తి సంతృప్తి* సరస్ మేళా లో జిల్లా యంత్రంగా చేసి ఏర్పాట్లు వల్ల సందర్శకులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సందర్శకులు అభిప్రాయాలు వారి మాటల్లోనే…*పోగులు కీర్తీ , లక్ష్మి గుజ్జనగుండ్ల, గుంటూరు*. మేళాలో కలంకారి, ప్రింటిండ్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. ఫుడ్ కోట్ల ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయి. సందర్శకులకు ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మంచినీరు సరఫరా, ప్రాంగణం లో పరిశుభ్రత చక్కగా నిర్వహిస్తున్నారు.*అంకం సువర్ణ కమల, ప్రీతి, తుళ్ళూరు*.పండగ రోజుల్లో ఏర్పాటు చేయడం వల్ల చాలా ప్రయోజనంగా ఉంది. సెలవు రోజుల్లో కుటుంబ సమేతంగా మేళాను సందర్శించి, అవసరమైన వస్తువులను కొనుగోలుకు వీలు కలిగింది. దేశంలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల నాణ్యమైన ఉత్పత్తులు గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రభుత్వం మేళలో సందర్శకులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చక్కగా చేసింది *మానవేంధ్ర, శ్రీదేవి , తెనాలి*.మెట్రో నగరాల్లో మాత్రమే నిర్వహించే జాతీయస్థాయి అఖిలభారత డ్వాక్రా బజార్ ను గుంటూరులో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాల వస్తువులు ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. దేశంలోనే ప్రసిద్ధి చెందిన హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ అందుబాటు ధరలోనే మేళాలో లభిస్తున్నాయి. దాదాపు లక్షకు పైగా ప్రజలు వచ్చిన ఇబ్బందులు లేకుండా స్టాల్స్ ను పరిశీలించేలా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అభినందనీయం.*కాకుమాను అనుషా, అరుణ, పేరేచర్ల. స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలన్న ప్రభుత్వాలోచన చాలా బాగుంది. మేళాలో హ్యాండ్ మేడ్ జ్యూవెలరీ, అలంకరణ వస్తువులు, చెప్పులు, హ్యాండ్లూమ్స్, పచ్చళ్ళు, పిండి వంటలు బాగున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆహార పదార్థాలను ఫుడ్ కోర్టులో బాగున్నాయి. ఏర్పాట్లు చక్కగా చేశారు. ప్రభావతి, తలసిల జ్యోతి, మున్నంగి బార్గవి పెదవడ్లపూడి మేళా లో డ్రెస్ మెటీరియల్స్, బెడ్ షీట్స్, , హ్యాండ్ బ్యాగ్, ఆయుర్వేద మందులు, నాచురల్, ఆర్గానిక్ ఆహార పదార్థాలు బాగున్నాయి. ఇక్కడ స్టాల్స్ ఏర్పాటుచేసి మహిళలు ఇతర స్వయం సహాయక సంఘాలు సభ్యులకు వ్యాపారాల ఏర్పాటు కు ప్రేరణ కలిగిస్తున్నారు. ఎంమ్యూజ్మెంట్ పార్కులో ఆట వస్తువులతో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం ప్రదర్శించే సాంస్కృతి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. సందర్శకులు ప్రశాంత వాతావరణంలో మేళాలో స్టాల్స్ పరిశీలించేలా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలా చక్కగా చక్కగా ఉన్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker