
మినీ భారత్ గా భారతదేశ సాంస్కృతి, సాంప్రదాయాల ప్రతీకగా దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలకు నిర్వహిస్తున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ ను శుక్రవారం కనుమ పర్వదినం రోజు అత్యధిక సంఖ్యలో ప్రజలు సందర్శించారు. ఉదయం నుంచే ప్రజల రద్దీ కొనసాగింది సాయంత్రం సమయంలో ఇది మరింత ఎక్కువైంది. ప్రజలు అత్యధిక సంఖ్యలో వస్తుండటంతో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా నిరంతర పర్యవేక్షణలో డీఆర్డీఎ పీడీ విజయలక్ష్మి, డి ఆర్డిఏ అధికారులు, ఇతర శాఖల అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాంగణంలో స్టాల్స్ వద్ద, ఎంమ్యూజ్మెంట్ పార్కులో, ఫుడ్ కోర్ట్, వేదిక వద్ద ఉన్న ఎలక్ట్రిక్ పాయింట్ల, ఇతర ఏర్పాట్లు ను. డీఆర్డీఏ, విద్యుత్, అగ్నిమాపక శాఖ , ఆర్ అండ్ బి, పోలీసు, మున్సిపల్ తదితర శాఖల అధికారులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తనిఖీలు నిర్వహించి, అవసరమైన ప్రాంతాల్లో వెంటనే మరమ్మత్తులు చేపడుతున్నారు. నాచురల్ ఫార్మింగ్, బ్యాంబో మరియు అగ్రి మార్కెటింగ్ పై శిక్షణ. సరస్ మేళా లోని శిక్షణా కేంద్రంలో శుక్రవారం స్వయం సహాయక సంఘ సభ్యులకు నాచురల్ ఫార్మింగ్, బ్యాంబో మరియు అగ్రి మార్కెటింగ్ పై మాస్టర్ ట్రైనర్ వై ప్రసంగి శిక్షణ అందించారు. సైబర్ మోసాలు, డిజిటల్ అవేర్నెస్, సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలు, యాప్ ల లింకులతో జరుగుతున్న ఫైబర్ నేరాలపై మ్యాజిక్ బస్సు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కిరణ్ అవగాహన కల్పించారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ ఐపిఓ సర్వీస్, తయారీ రంగ వ్యాపారాలకు రాయితీతో ప్రభుత్వం అందించే రుణాల గురించి వివరించారు.







