
బాపట్ల, 17/01/2026:
బాపట్లలో మ్యాజిక్ బస్ ఫౌండేషన్ మరియు ఆగాపే చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఆర్. పుష్పలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడుతూ సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయరాదని, అలా చేస్తే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు దోపిడీ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అలాగే ఆగాపే చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఆర్. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది పాల్గొని సైబర్ సెక్యూరిటీపై అవగాహన పొందారు.











