ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS: ఆబ్కాస్ వ్యవస్థను కొనసాగించాలని సీపీఐ డిమాండ్
CPI AGITATION IN GUNTUR
అపరిస్కృతంగా ఉన్న మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో
కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు కోట మాల్యాద్రి, బందెల రవికుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆబ్కాస్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు అందించే విషయంలో ఆబ్కాస్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ఏజెన్సీల వ్యవస్థకు అప్పజెప్పితే కార్మికులకు నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఆబ్కాస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి కార్మికులకు మేలు చేయాలని సూచించారు.