
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైన ఎన్టీఆర్ గారి సేవలను స్మరిస్తూ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏలూరి క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇంకొల్లు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.Bapatla Local News
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు మాట్లాడుతూ…
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ గారని, రాజకీయాల్లో విలువలు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన అసమాన నాయకుడని కొనియాడారు. పేదల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, మహిళల సాధికారతకు ఎన్టీఆర్ గారు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను నేటి తరానికి చేరవేయాల్సిన బాధ్యత మనందరిదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని “జోహార్ ఎన్టీఆర్” నినాదాలతో ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించారు.










