
వేమూరు మండలం పెనుమర్రు గ్రామంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌములు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలతో అలంకరణ చేసి, ఆయనకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నగారి ఆశయాలను స్మరించుకున్నారు. ప్రజల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

కార్యక్రమం అంతా “జోహార్ ఎన్టీఆర్”, “ఎన్టీఆర్ అమర్ రహే” నినాదాలతో మార్మోగింది. యువతలో ఎన్టీఆర్ ఆశయాలు మరింత బలంగా నాటాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం భక్తి భావంతో, క్రమశిక్షణతో ముగిసింది.










