
కృష్ణా: మచిలీపట్నం:-తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారు తెలుగుజాతిలో చైతన్యం నింపిన మహా వ్యక్తి అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎన్నో విభిన్నమైన, విశిష్టమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. పురాణ పాత్రల నుంచి సామాజిక పాత్రల వరకు ఆయన చేసిన నటన తెలుగు సినీ పరిశ్రమకు దిశానిర్దేశం చేసిందని పేర్కొన్నారు.
రాజకీయ రంగంలోకి వచ్చి తెలుగువారిలో ఆత్మగౌరవ భావనను నింపిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలుగు ప్రజల స్వాభిమానం కోసం ఆయన చేపట్టిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడుచుకుంటూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడమే తమ ధ్యేయమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.సంక్రాంతి “సంబరాల్లో “MP,వల్లభనేని బాలశౌరి
ఎన్టీఆర్ సేవలు, ఆశయాలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఆయన స్మృతి ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి పేర్కొన్నారు.










