
బాపట్ల: జనవరి 18: 2026:-తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని పురస్కరించుకుని బాపట్ల ఎంపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ నాయకులు, ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగ్గ మహానేత అని కొనియాడారు. సామాన్యుల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సాదు నాగేశ్వరావు, నక్క ప్రకాష్ రావు, భోగిరి పృధ్వీ రాజ్, గావిని దుర్గ ప్రసాద్, కర్నేటి ఏడకొండలు తదితరులు పాల్గొన్నారు.










