
నరసరావుపేట:- ఆంధ్రుల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతిని పురస్కరించుకుని నరసరావుపేట పట్టణంలో ఆదివారం ఘన నివాళి కార్యక్రమాలు నిర్వహించారు.

పట్టణంలోని గుంటూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం, పల్నాటి రోడ్డులోని పాత గవర్నమెంట్ హాస్పిటల్, మదర్ తెరిసా హాస్పిటల్, పల్నాడు బస్టాండ్ పాత చెక్‌పోస్ట్, ఎన్జీవో కాలనీ, 23, 24 వార్డులు, రైల్వే స్టేషన్ రోడ్డులోని అండర్‌గ్రౌండ్ బిజీ, ప్రకాశ్‌నగర్ రిజిస్టర్ కార్యాలయం, ప్రకాశ్‌నగర్ 60 అడుగుల రోడ్, వినుకొండ రోడ్డులోని నవయుగ రెస్టారెంట్, ఆర్టీసీ బస్టాండ్, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, లింగంగుంట్ల గ్రామం తదితర ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమాల్లో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ జాన్ సైదా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. అరవింద్ బాబు మాట్లాడుతూ, సినిమా రంగంలో అపూర్వమైన ఖ్యాతిని సంపాదించిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారని గుర్తు చేశారు. బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
అన్నపూర్ణ పథకం, మండల వ్యవస్థ, వృద్ధులకు నెలవారీ పెన్షన్లు, తిరుమల తిరుపతిలో భక్తులకు నిత్య అన్నదానం, మహిళలకు ఆస్తి హక్కులు వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడుచుకుంటూ ప్రజల కోసం అంకితభావంతో పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని అన్నారు.Narasaraopet MLA Dr. Chadalawada Aravinda Babu
పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ జాన్ సైదా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతను తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. సామాన్యుడి గొంతుకగా మారి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసిన మహానాయకుడిగా ఆయనను స్మరించుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నల్లపాటి రామచంద్ర ప్రసాద్, కడియాల వెంకటేశ్వరరావు, కడియాల రమేష్, వేములపల్లి నరసయ్య, షేక్ మీరావలి, నాగసరపు సుబ్బరాయ గుప్తా, మన్నాన్ షరీఫ్, గట్టుపల్లి సత్యనారాయణ, బండారుపల్లి విశ్వేశ్వరరావు, పల్లెల నాగిరెడ్డి, పులుకూరి జగ్గయ్య, వాసిరెడ్డి రవి, గాడిపర్తి సురేష్, కొల్లిపాక చంద్రశేఖర్, పుచ్చకాయల బసవేశ్వరరావు, అమర్, కూరపాటి శ్రీనివాసరావు, గంగుల పెద్దిరెడ్డి, మహానంద రెడ్డి, మడకా శివప్రసాద్, ప్రభుదాస్, పోకా శ్రీనివాసరావు, బత్తుల సెల్వరాజ్, మాబు, సుభాని తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










