
ప్రత్తిపాడు, జనవరి 18, 2026:- సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే మహోన్నత నినాదంతో ప్రజాహితాన్ని పరమార్థంగా భావించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఘన నివాళి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అదే విధంగా వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామంలో కూడా ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి డా. బూర్ల రామాంజనేయులు గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రజల సంక్షేమమే ఆయన జీవిత లక్ష్యమని ఎమ్మెల్యే గారు కొనియాడారు.
ఈ రెండు కార్యక్రమాల్లో కూటమి నాయకులు, పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొని ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమాలంతా జయజయధ్వానాల మధ్య, ఎన్టీఆర్ నినాదాలతో ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.GUNTUR










