
పట్టణం, జనవరి 18:-ఎన్టీఆర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక మహాశక్తి అని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్టీఆర్‌కు ముందు–తర్వాత అనేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన యుగపురుషుడని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సామాజిక సంస్కరణలు, ప్రజాకర్షక సంక్షేమ పథకాలతో తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని వారు కొనియాడారు. ధైర్యసాహసాలు, ప్రజల పట్ల అంకితభావంతో పాలన సాగించిన ధీరోధాత్తుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే, ఎంపీ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని ఎన్.ఆర్.టీ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ నిజంగా కారణజన్ముడని అన్నారు. అఖిల భారతావని మెచ్చేలా సాగిన ఆయన సుపరిపాలన, పాలనా సంస్కరణలు నేటికీ అనేక రాజకీయ నాయకులకు దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు.
ఎన్.ఆర్.టీ కూడలిలో నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే ప్రత్తిపాటి స్థానిక కూటమి నాయకులతో కలిసి అడ్డరోడ్డు, 26, 27, కళామంధీర్ సెంటర్, 32 భవనృషి నగర్, 34, 35 కార్డులు సుగాలీ కాలనీ, 7వ వార్డు, పసుమర్రు, గోరంట్లవారిపాలెం, నాగభైరువారిపాలెం గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

7వ వార్డులో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ప్రత్తిపాటి 300 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అలాగే ఎన్.ఆర్.టీ కూడలిలో మోటార్ మెకానిక్స్ వర్కర్లు, చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని కూడా ఆయన ప్రారంభించారు.Guntur Local news
ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










