
బాపట్ల: జనవరి 18:- స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని బాపట్ల నియోజకవర్గం, బాపట్ల మండలం భర్తీపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడిగా, ప్రజల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తిగా వక్తలు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు.Bapatla Local News
కార్యక్రమంలో భర్తీపూడి గ్రామ సర్పంచ్ ఆచంట అమరేష్ పాల్గొన్నారు. నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం అంతటా ఎన్టీఆర్ నినాదాలు, జై ఎన్టీఆర్ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.










