
బాపట్ల:-ఈరోజు బాపట్ల ఏరియా హాస్పిటల్‌లో ఏపీ ఎన్జీ జీఓ బాపట్ల జిల్లా క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ గారు, ఆర్ఎంఓ డాక్టర్ సుజాత లక్ష్మి గారు, డీసీ మేడం పద్మావతి గారు పాల్గొన్నారు.
అలాగే ఏపీ ఎన్జీ జీఓ బాపట్ల జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బి. కోటేశ్వరావు గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి సిహెచ్. సరళ కుమార్ గారు పాల్గొని క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సిబ్బంది, ఏపీ ఎన్జీ జీఓ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.










