
Vijayawada:-టాక్టికల్ అర్బనిజం కార్యక్రమంలో భాగంగా ఎన్‌టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమణలను తొలగిస్తూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డి.సి.పి. శ్రీమతి షీరిన్ బేగం ఐ.పి.ఎస్. సూచనలతో, వన్ ట్రాఫిక్ ఏ.సి.పి. రామచంద్ర రావు గారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ స్పెషల్ డ్రైవ్‌లో వన్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఏ. ఉమామహేశ్వర రావు గారు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం కేఆర్ మార్కెట్ నుంచి భావనారాయణ వీధి వరకు, అలాగే చిట్టూరి కాంప్లెక్స్ నుంచి బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయం వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

తనిఖీలలో భాగంగా అక్రమంగా పార్క్ చేసిన వాహనాలను తొలగించడంతో పాటు, రోడ్లను ఆక్రమించి ఉంచిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రోడ్లపై అక్రమణలు చేయరాదని, ఇష్టానుసారం వాహనాలు పార్కింగ్ చేయరాదని, రోడ్లపై ఎటువంటి వస్తువులను ఉంచి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించకూడదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.Vijayawada Localnews
నిబంధనలు ఉల్లంఘించి రహదారులపై అంతరాయం కలిగిస్తే ట్రాఫిక్ పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.










