
మోతడకలోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చలపతి అధినేత వై.వి. ఆంజనేయులు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వై.వి. ఆంజనేయులు, అనంతకుమారి దంపతులు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
అనంతరం మోతడక ఇంజనీరింగ్ కళాశాల, చలపతి ఫార్మసీ కళాశాల, ఇంటర్ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. Lam చలపతిలో ఘనంగా జరిగిన జనరేటివ్ ఎఐ శిక్షణాశిబిరం:

చలపతి మోతడక ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కే. నాగ శ్రీనివాసరావు, డీన్ అడ్మిషన్స్ డా. కిరణ్ కుమార్, ఫార్మసీ ప్రిన్సిపాల్ డా. ఎన్.వి. రామారావు, ఇంటర్ డీన్ శివప్రసాద్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మోతడక“భవిష్యత్తు స్మార్ట్ సిటీస్ & ఇంటెలిజెంట్ మొబిలిటీ” సెమినార్ ఘనంగా ప్రారంభం
కళాశాల ప్రాంగణంలో రెయిన్బో బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, వై.వి. ఆంజనేయులు రాజకీయంగా, విద్యాసంస్థల అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారని తెలిపారు. చలపతి విద్యాసంస్థలు దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం విశాల స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వెన్నా సాంబశివారెడ్డి, కంచర్ల శివరామయ్య తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. Chalapathi Institute of Technology:మోతడకలో ఫ్యూచర్ ఎక్స్ 2025 టెక్ ఫెస్ట్ ఘనంగా జరిగింది
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్స్, అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.











