chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :సిసిటివి కెమెరాలన్నీ సక్రమంగా పని చేయాలిప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్

గుంటూరు, జనవరి 22 :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన 14 వేల సిసిటివి కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు. ముఖ్య కూడళ్ళు, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రజా ప్రాధాన్యత ఉన్న చోట్ల ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

Guntur Local News :సిసిటివి కెమెరాలన్నీ సక్రమంగా పని చేయాలిప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్

సిసిటివి ప్రాజెక్టు అమలు, డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్, పాజిటివ్ పబ్లిక్ పెర్సెప్షన్ అంశాలపై గురువారం ఎపి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకు సిసిటివి కెమెరాలు కీలకంగా మారాయని అన్నారు. Guntur Local newsనేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టే దిశగా రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంతో అనుసంధానించి సిసిటివి వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ప్రసూన, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె. మయూరి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి. మురళీధర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పార్థసారథి, ఎం.టి.ఎం.సి అదనపు కమిషనర్ హేమ మాలిని తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker