
గుంటూరు, జనవరి 23:- జిల్లాలో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త కార్యక్రమానికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజెండా అంశాలపై మాట్లాడుతూ, బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు మార్చి 8వ తేదీ నాటికి నూరుశాతం గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా అందిన దరఖాస్తులను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ఎస్‌ఎల్‌ఏలోపే అనుమతులు మంజూరు చేసేలా పరిశ్రమల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ, పరిశ్రమలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆర్‌ఎంపీ శిక్షణ కార్యక్రమాలను డీఆర్‌డీఏ, మెప్మా, మండల స్థాయి అధికారులు, పరిశ్రమల సంఘాలతో సమన్వయం చేసుకుని మార్గదర్శకాలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఎస్‌ఐపిబి, క్యాబినెట్ ఆమోదం పొందిన పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న పరిశ్రమలు వేగంగా స్థాపించబడేలా సంబంధిత శాఖలు పర్యవేక్షించాలని తెలిపారుGuntur Local News.
వ్యాపారవేత్తలకు స్మార్ట్ మీటర్లపై అవగాహన కల్పించేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పరిశ్రమల రాయితీలకు సంబంధించిన 18 క్లైయిమ్స్‌కు రూ.1,63,91,972లను మంజూరు చేస్తూ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఏ. జయలక్ష్మి, ఏపిపిసిబి ఈఈ ఎండి నజీనా బేగం, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం.ఎల్.ఎన్. రావు, డిపిఓ సాయికుమార్, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డీడీ చెన్నయ్య, డీసీఎల్ఏ గాయత్రి దేవి, భూగర్భ జలవనరుల శాఖ డీడీ వందనం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు, జిల్లా టూరిజం అధికారి రమ్య, సీపీడిసిఎల్ గుంటూరు సర్కిల్ ఈఈ నాగేశ్వరరావు, కేవీఐబి ఏడి ఏ ఆనంద్ కుమార్, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, సిక్కి ఆర్‌ఎం పరిమళ, డీఐసీసీఐ జిల్లా కోఆర్డినేటర్ కె. పావని తదితరులు పాల్గొన్నారు.










