
హైదరాబాద్:-తెలంగాణ రాష్ట్రంలోని యువ గాయనీ–గాయకుల ప్రతిభను గుర్తించి, వారికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో నుమాయిష్ సూర్-స్టార్ 2026 పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ వెల్లడించింది.
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ కార్యదర్శి బి.ఎన్. రాజేశ్వర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు సుమారు 400 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు అప్లికేషన్ల స్వీకరణకు అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల వారు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ పోటీలకు 16 నుంచి 35 ఏళ్ల వయస్సు గల వారికి అర్హత ఉంటుందని తెలిపారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు సంబంధించిన పాటలను నుమాయిష్‌లో సందర్శకుల సమక్షంలో పాడాల్సి ఉంటుందని వివరించారు.Hyderabad Local News
పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు గాయకులను ఎంపిక చేసి ఫిబ్రవరి 8న గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో విజేతగా నిలిచిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి మరియు సూర్-స్టార్ 2026 ట్రోఫీ అందజేస్తామని తెలిపారు. మిగిలిన ముగ్గురికి చొప్పున 50 వేల రూపాయల నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు.










