chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

Vesakhapatanam Local News :అంతర్ రాష్ట్ర యువ సమ్మేళనంలో ఎం.ఎస్.ఎం.ఇ చైర్మన్ టి. శివ శంకరరావు

విశాఖపట్నం, జనవరి 23:-ప్రాంతాలు వేరైనా భారతదేశ పౌరులుగా మనమంతా ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఇ చైర్మన్ తమ్మిరెడ్డి శివ శంకరరావు అన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో విశాఖపట్నం యూత్ హాస్టల్స్‌లో శుక్రవారం ప్రారంభమైన అంతర్ రాష్ట్ర యువ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

Vesakhapatanam Local News :అంతర్ రాష్ట్ర యువ సమ్మేళనంలో ఎం.ఎస్.ఎం.ఇ చైర్మన్ టి. శివ శంకరరావు

ఈ సందర్భంగా శివ శంకరరావు మాట్లాడుతూ భారతదేశ పౌరులుగా గర్వంగా జీవిస్తున్నామని తెలిపారు. మినీ ఇండియాగా పేరుగాంచిన విశాఖపట్నం యువతకు ఎన్నో అనుభూతులను అందిస్తుందని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను తెలుసుకోవాలని సూచించారు.

ఈ అంతర్ రాష్ట్ర యువ సమ్మేళనంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది యువతులు సహా మొత్తం 37 మంది యువత పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ఏపీ విభిన్న ప్రతిభావంతులు శాఖ సహాయ సంచాలకులు కవిత మాట్లాడుతూ కేంద్ర యువజన సేవలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు యువతకు దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. ఈ పర్యటనలో తేనెలొలికే తెలుగు భాషలోని పదాలను నేర్చుకోవాలని యువతకు సూచించారు.

Vesakhapatanam Local News :అంతర్ రాష్ట్ర యువ సమ్మేళనంలో ఎం.ఎస్.ఎం.ఇ చైర్మన్ టి. శివ శంకరరావు

మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి విశాఖ జిల్లా యువ అధికారి జి. మహేశ్వర రావు ప్రారంభ ఉపన్యాసంలో యువ సమ్మేళనం లక్ష్యాలను వివరించారు. సీనియర్ జర్నలిస్టు నాగనబోయిన నాగేశ్వరరావు వ్యాఖ్యతగా వ్యవహరించారు.

Vesakhapatanam Local News :అంతర్ రాష్ట్ర యువ సమ్మేళనంలో ఎం.ఎస్.ఎం.ఇ చైర్మన్ టి. శివ శంకరరావు

Hyderabad- Amaravathiఈ కార్యక్రమంలో పురాతన వస్తువుల సేకరణకర్త కోరుపోలు గంగాధర రావు, రాజీవ్ గాంధీ జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవి కుమార్, మేరా యువ భారత్ పూర్వ ఉద్యోగి అల్లం రామ్ ప్రసాద్, సమాజహిత పత్రిక సంపాదకులు కె. నరసింహం తదితరులు ప్రసంగించారు. అనంతరం యువ సమ్మేళన గోడ పత్రికను అతిథులు ఆవిష్కరించారు.

మేరా యువ భారత్ ప్రతినిధులు కె. శ్రీనివాసరావు, ప్రసన్న గోపాల్, వాలంటీర్లు జేమ్స్, ప్రసన్న కుమార్, జ్ఞానదీప్, రాజు తదితరులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Vesakhapatanam Local News :అంతర్ రాష్ట్ర యువ సమ్మేళనంలో ఎం.ఎస్.ఎం.ఇ చైర్మన్ టి. శివ శంకరరావు

యువ సమ్మేళనంలో భాగంగా కోరుపోలు గంగాధర రావు ఏర్పాటు చేసిన పురాతన వస్తు ప్రదర్శన యువతను విశేషంగా ఆకర్షించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్, దంతేవాడ, సూరజ్‌పూర్, సుర్గుజా, రాజ్‌గఢ్, మహాసముంద్, బాలోద్, రాయపూర్ జిల్లాల నుంచి వచ్చిన యువత ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker