
కృష్ణా, మచిలీపట్నం:-ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక పిలుపునిచ్చారు.
ఉమ్మడి కృష్ణ జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ మండలాల్లోని మండల పరిషత్ కార్యాలయాలు, జిల్లా పరిషత్ హైస్కూల్లలో పనిచేస్తున్న 20 మంది జూనియర్ అసిస్టెంట్లు, 5 మంది టైపిస్టులు కలిపి మొత్తం 25 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు.
ఈ సందర్భంగా శుక్రవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక ఉత్తర్వులను ఉద్యోగులకు అందజేశారు.Krishna district news local Telugu: కృష్ణా జిల వార్తలు
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో కన్నమ్మ నాయుడు, డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.










