
మచిలీపట్నం, జనవరి 23, 2026 :-జనవరి 25న నిర్వహించనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో ఉద్యోగులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి 25న దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియను ప్రోత్సహించడం, ముఖ్యంగా యువతను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
“నా భారత్, నా ఓటు” (My India, My Vote) అనే అంశంతో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికల్లో ప్రతి పౌరుడు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలనే అవగాహన కల్పించడమే ఉద్దేశమన్నారు.

జనవరి 25 ఆదివారం సెలవు దినం కావడంతో ముందస్తుగా ఈరోజే ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించినట్లు డీఆర్ఓ కే. చంద్రశేఖరరావు తెలిపారు.మచిలీపట్నంలో పోలీస్ శిక్షణ కేంద్రం శంకుస్థాపన||Police Training Center Groundbreaking in Machilipatnam
ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో గుడివాడ ఆర్డిఓ జి. బాలసుబ్రహ్మణ్యం, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ పరిపాలనాధికారి రాధికతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










