
విశాఖపట్నం, జనవరి 24:-ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను వేగంగా భర్తీ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించిందని ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ మేళా ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించి, వారిలో కొత్త ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరిగిందన్నారు.

శనివారం ఉదయం సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ సాగర్‌మాల కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉండేదని, సంవత్సరాల తరబడి నోటిఫికేషన్లు వెలువడని పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మిషన్ మోడ్‌లో చేపట్టి వేగవంతం చేసిందన్నారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 17 రోజ్‌గార్ మేళాలను విజయవంతంగా నిర్వహించి సుమారు 11 లక్షల మందికి నియామక పత్రాలు అందజేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని మంత్రి వెల్లడించారు. తాజాగా నిర్వహించిన 18వ రోజ్‌గార్ మేళాలో దేశవ్యాప్తంగా 61 వేల మందికి నియామక పత్రాలు అందజేయగా, విశాఖపట్నంలో 392 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారుAPSRTC CONTACT NUMBERS AND MAIL IDS OF DEPOT MANAGERS.
మేక్ ఇన్ ఇండియా, మెడ్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోందని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ ఐజీ శర్వానన్, డీఐజీ డా. రాఘవేంద్రకుమార్, పోర్టు సెక్రటరీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.










