
విశాఖ:- నేటి నుంచి విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ఇన్‌చార్జి మంత్రి బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ప్రారంభించనున్నారు.

విశాఖ ఉత్సవాల సందర్భంగా నగరమంతా విద్యుత్ దీపాలతో కళకళలాడనుంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కాళీమాత దేవాలయం ఎదురుగా ఉన్న ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఆర్కే బీచ్‌ను కేంద్రంగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక సంప్రదాయ కళలు, గిరిజన నృత్యాలు, జానపద ప్రదర్శనలు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్రధాన వేదిక సమీపంలో 70 ఫుడ్ స్టాళ్లు, స్థానిక కళాకారులు తయారు చేసిన హస్తకళా వస్తువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదనంగా 42 అడుగుల ఎల్‌సీడీ స్క్రీన్ సాగరతీరంలో ఏర్పాటు చేయడంతో ప్రేక్షకులకు కనుల విందుగా మారనుంది.
విశాఖ ఉత్సవాల్లో భాగంగా పర్యాటకులను ఆకర్షించేలా హెలికాప్టర్ రైడ్స్, పారా గ్లైడింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. భీమిలిలో ప్రత్యేకంగా హాట్ ఎయిర్ బెలూన్ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు.పలాస సమీపంలో భారీ కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రణాళిక||Cargo Airport Proposed Near Palasa, Srikakulam
సముద్రం, కొండల మధ్య జరిగే ఈ ఉత్సవాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.










