chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local News :అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనం

విజయవాడ :-అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. వచ్చే ఏప్రిల్ 11న జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్మృతి వనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

Vijayawada Local News :అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనం

బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు స్థలాలు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బీసీ స్టడీ సర్కిళ్లు లేని జిల్లాల్లో నూతన స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

అమరావతిలో ఐదు ఎకరాల్లో రాష్ట్ర స్థాయి బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయనున్నామని, దీనికి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Vijayawada Local News :అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనం

విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో పలు బీసీ సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. 19 నెలల కూటమి పాలనలో బీసీల కోసం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. బీసీలకు మరింత ఆర్థిక భరోసా కల్పించేలా సంఘాల వారీగా అభిప్రాయాలు సేకరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టీడీపీ పాలనలోనే బీసీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ గుర్తింపు లభించిందన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కులవృత్తిదారులకు ఆదరణ, ఆదరణ 2.0 అమలు చేశామని, త్వరలో రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Vijayawada Local News :అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనం

బీసీల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, సాంకేతిక విద్య కోసం కంప్యూటర్ ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సివిల్ సర్వీసెస్, మెగా డీఎస్సీ కోసం ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.Vijayawada Local news

డీఎన్టీ కులాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కుల గణన కోసం త్వరలో డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. బీసీల సమస్యల పరిష్కారానికే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు.

ఈ సమావేశంలో వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker