
బాపట్ల:– 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం బాపట్ల పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శక్తి టీం అధికారులను ఎంపిక చేసి సన్మానించారు.

జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనల మేరకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకుగాను ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపికైన శక్తి టీం అధికారులకు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు.
చీరాల నియోజకవర్గంలో విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకే ఈ పురస్కారం లభించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ గుర్తింపు తమ సేవలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ప్రజలు అభినందించారు.

గణతంత్ర దినోత్సవం రోజున ప్రశంస పత్రాలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని శక్తి టీం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మోయిన్, వన్‌టౌన్ సీఐ సుబ్బారావుకు శక్తి టీం కృతజ్ఞతలు తెలిపింది.Bapatla Local News
ప్రశంస పత్రాలు అందుకున్న శక్తి టీం అధికారులు:
ఏ. హరిబాబు – ఎస్సై,
కే. సుబ్బారావు – కానిస్టేబుల్,
సిహెచ్. సునీత – లేడీ కానిస్టేబుల్,
శివకుమారి – ఏఎస్సై.










