
గుంటూరు, జనవరి 27:- రెవిన్యూ అంశాల పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఐవీఆర్ఎస్, మ్యుటేషన్, రీ-సర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐవీఆర్ఎస్ వంటి వ్యవస్థల ద్వారా ప్రజల అభిప్రాయాలు, ఫిర్యాదులను ప్రభుత్వం స్వీకరిస్తోందని తెలిపారు. రెవిన్యూ అధికారులు బాధ్యతతో వ్యవహరించి సమస్యలను వేగంగా పరిష్కరిస్తేనే ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. ముఖ్యంగా మ్యుటేషన్ వంటి కీలక అంశాలను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు.Guntur Local news
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి తదితర అధికారులు పాల్గొన్నారు.










