
విజయవాడ, జనవరి 27:– డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యంగా ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్‌పై దండయాత్ర’ నినాదంతో 35 రోజులపాటు 510 కిలోమీటర్ల సైకిల్ యాత్రను మంగళవారం ప్రారంభించారు.

ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీకి రాష్ట్ర హోంశాఖ మంత్రి వి.అనిత, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జెండా ఊపి ప్రారంభించారు.
పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఐపీఎస్, జిల్లా కలెక్టర్ లక్ష్మి శా ఐఏఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది విద్యార్థులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ ఏకే రవికృష్ణ ఐపీఎస్, ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి వి.అనిత మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. డ్రగ్స్ వల్ల అనేక కుటుంబాలు నాశనమవుతున్నాయని, సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. మహిళా పోలీసుల సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ డ్రగ్స్ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారాయని, ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఎంపీ కేశినేని శివనాధ్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్‌లో ఉద్యమాత్మక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. డ్రగ్స్ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారం అవసరమన్నారు.
ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల తల్లిదండ్రుల జీవితాలు విషాదంగా మారుతున్నాయని, దేశ భద్రతకూ ఇవి ముప్పుగా మారుతున్నాయన్నారు.

జిల్లా కలెక్టర్ లక్ష్మి శా మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, యువతను రక్షించేందుకే ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.Vijayawada Localnews










