chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :జనాభా లెక్కల సేకరణ–2027పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి-సీఎస్ విజయానంద్

గుంటూరు, జనవరి 29 :-రానున్న జనాభా లెక్కల సేకరణ–2027 ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.

Guntur Local News :జనాభా లెక్కల సేకరణ–2027పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి-సీఎస్ విజయానంద్

గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 2027 జనాభా లెక్కల సేకరణ సన్నాహకాలు, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, డిస్పెన్సరీలు, ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు, పాజిటివ్ పబ్లిక్ పెర్సెప్షన్ అంశాలపై సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ, జనాభా లెక్కల సేకరణ విజయవంతం కావాలంటే ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ దిశగా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.Guntur nagaram lo

జనాభా లెక్కల సేకరణ–2027పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఐఈసీ (IEC) మెటీరియల్ రూపొందించి అన్ని జిల్లాలకు పంపాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ప్రగతి, డిస్పెన్సరీలు, ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు అంశాలపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు అవసరమైన స్థలాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని సీఎస్‌కు వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే.ఖాజావలితో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker