
బాపట్ల: పర్చూరు:- తెలుగుదేశం పార్టీ పర్చూరు నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ రసూల్ తండ్రి షేక్ మస్తాన్ వలి మృతి పట్ల పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మస్తాన్ వలి మృతి అత్యంత బాధాకరమని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. మస్తాన్ వలి మృతి కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటు అని అన్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి మస్తాన్ వలి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గ్రామ అభివృద్ధిని కాంక్షించే మంచి వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. పార్టీ ఒక నిబద్ధత గల కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.Bapatla Local News
ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని, మస్తాన్ వలి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రార్థించారు.










