chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

Palnadu Local News :పల్నాడు జిల్లా పోలీసుల విస్తృత కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు

పల్నాడు, జనవరి 31, 2026:-శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేర నియంత్రణ లక్ష్యంగా పల్నాడు జిల్లా పోలీసులు విస్తృతంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ బి. కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధి చెరుకుంపాలెం గ్రామంలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

Palnadu Local News :పల్నాడు జిల్లా పోలీసుల విస్తృత కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు

సత్తెనపల్లి డీఎస్పీ శ్రీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. గ్రామంలో ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో మన్నే సుల్తాన్ పాలెం గ్రామంలో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌తో పాటు గడ్డపారలు–5, కొడవళ్ళు–3, రాడ్లు–9, వైరు చుట్టలు–1ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Palnadu Local News :పల్నాడు జిల్లా పోలీసుల విస్తృత కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు

అదనంగా రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, శాంతి భద్రతలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని డీఎస్పీ గ్రామస్తులకు సూచిస్తూ ప్రతిజ్ఞ చేయించారు.

Palnadu Local News :పల్నాడు జిల్లా పోలీసుల విస్తృత కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు

గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని, ఏ చిన్న సమస్య ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని అధికారులు తెలిపారు. పాత కేసుల నిందితులు పాత పంథా విడిచి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ ఎం. హనుమంతరావుతో పాటు అచ్చంపేట సీఐ పి. శ్రీనివాసరావు, పెదకూరపాడు సర్కిల్ సీఐ పి. సురేష్, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ సీఐ పి. కిరణ్, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.PALANADU NEWS: మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే : పల్నాడు జిల్లా కలెక్టర్ హెచ్చరిక


Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker