
హైదరాబాద్:-తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ గోశామహల్ బీఆర్ఎస్ శ్రేణులు ఏంజే మార్కెట్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. జాంబాగ్ బీఆర్ఎస్ నేత అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తా రోకో కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలను చింపడంతో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు.Hyderabad Local news










