
మచిలీపట్నం, ఫిబ్రవరి 01, 2026:– ఈ నెల 2వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ‘మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.
ప్రజలకు పాలన మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
అర్జీదారులు తమ సమస్యలను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చని సూచించారు. అలాగే మీకోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు అర్జీ స్థితిని కూడా తెలుసుకోవచ్చన్నారు.మచిలీపట్నంలో జనసేన నేత సస్పెన్షన్ కలకలం||JanaSena Leader Suspension Creates Stir in Machilipatnam
అదేవిధంగా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అర్జీలు నమోదు చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.










