
బాపట్ల జిల్లా, రేపల్లె:– రేపల్లె మండలానికి చెందిన రైతులు తమ పంటలకు జరుగుతున్న నష్టాలపై జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

రేపల్లె మండల పరిధిలో వ్యవసాయ భూముల మధ్యలో ఓ ధనిక వ్యక్తి సుమారు 20 ఎకరాల్లో రొయ్యల చెరువు ఏర్పాటు చేసి, ఉప్పునీటి బోరు బావులు తవ్వించడంతో చుట్టుపక్కల రైతుల పొలాలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఉప్పునీటి ప్రభావంతో భూమి ఉప్పుగా మారి, పంటలు సరిగా పండక దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే తమ జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు తెలిపారు.

ఈ వ్యవహారంపై అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, రొయ్యల చెరువుల వల్ల కలుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్‌ను కోరారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో రైతులు బెల్లంకొండ శ్రీనివాసరావు, యామినేని శ్రీనివాసరావు సహా పలువురు రైతులు పాల్గొన్నారు.










