
Visakha :-కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాదరీ, జివిఎంసీ అడిషనల్ కమిషనర్ సత్యవాణి పాల్గొన్నారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, PGRSలో వచ్చే ప్రతి సమస్యను నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు మళ్లీ రీ-ఓపెన్ కాకుండా నాణ్యమైన, శాశ్వత పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గడువు దాటినా అర్జీలను నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని, ప్రజలకు నిజమైన ప్రయోజనం కలిగే విధంగా రెవెన్యూ క్లినిక్‌లు అర్థవంతంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ అధికారులు ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ముఖ్యంగా గ్రామీణ మండలాల్లో భూ సంబంధిత సమస్యలపై మరింత దృష్టి పెట్టాలని ఆదేశించారు.

ముందుగా నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులను కలెక్టర్ అభినందించారు. అదే విధంగా IFR కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.Visakhapatnam Local News :విశాఖ ఉత్సవం ప్రారంభానికి సన్నాహాలు-వైజాగ్–అనకాపల్లి–అరకు “సీ టు స్కై” పర్యాటక కారిడార్‌కు బలం







