
కృష్ణాజిల్లా:- గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి CWSN విద్యార్థిని అమీనా తబుసం రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
జనవరి 27న నెల్లూరులోని ఎస్.వి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన 8వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో అమీనా తబుసం తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని, వైకల్యం విజయంలో ఎలాంటి అడ్డంకి కాదని కలెక్టర్ పేర్కొన్నారు. అమీనా సాధించిన విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్. కుముదిని సింగ్, సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయకర్త కళ్లేపల్లి ఏడుకొండలు, ఏఎల్‌ఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఐఆర్పీలు హమీద్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.Krishna district news local Telugu: కృష్ణా జిల వార్తలు










