
గుంటూరు:- ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి పట్టణానికి చెందిన జంజనం వెంకట సాంబశివరావు (జేఎస్ఆర్)ను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని తన కార్యాలయంలో జగ్గారపు శ్రీనివాసరావు జేఎస్ఆర్కు నియామక పత్రాన్ని అందజేశారు.
ప్రస్తుతం జేఎస్ఆర్ అమరావతి టైలర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, ఆల్ ఇండియా భవాని చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షులుగా, మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా జేఎస్ఆర్ మాట్లాడుతూ జిల్లాలో పద్మశాలి సంఘాన్ని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసి సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే జిల్లాలోని పద్మశాలీల సమస్యలపై పోరాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు.Guntur Local news
జేఎస్ఆర్ నియామకంపై సంఘం మాజీ అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు, పద్మశాలి నాయకులు మునగాల నాగేశ్వరావు, బుద్దంటి రవికిరణ్, కొల్లి బాబురావు, నందం యశోద బాబు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.










