chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :సేవా సేతు ద్వారా తల్లి ప్రేమను అనుసంధానించాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి.

బాపట్ల, ఫిబ్రవరి 02, 2026:– అంగన్వాడి కేంద్రాలకు “తల్లి ప్రేమ”ను చేరువ చేయాలనే లక్ష్యంతో బాపట్ల సేవా సేతు ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. తెలిపారు.

సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 1,552 అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Bapatla Local News :సేవా సేతు ద్వారా తల్లి ప్రేమను అనుసంధానించాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి.

ప్రతి అంగన్వాడి కేంద్రానికి అవసరమైన పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దాతలు అందించే విరాళాలను సద్వినియోగం చేసుకునేందుకు బాపట్ల సేవా సేతు ద్వారా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అంగన్వాడి కేంద్రాల్లో ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు తల్లి ప్రేమతో కూడిన సంరక్షణ అందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి కేంద్రానికి అవసరమైన మౌలిక వసతులను వెబ్‌సైట్‌లో నమోదు చేసి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు.bapatla news

విరాళాల రూపంలో అందిన వస్తువులకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. అంగన్వాడి సూపర్వైజర్లు, సిడిపివోలకు ప్రత్యేక లాగిన్‌లు ఇచ్చి, పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు తెలిపారు.

Bapatla Local News :సేవా సేతు ద్వారా తల్లి ప్రేమను అనుసంధానించాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి.

పేదలకు బహుళ ప్రయోజనం కలిగించేలా రూపొందించిన బాపట్ల సేవా సేతు వెబ్‌సైట్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన పి4 కార్యక్రమ స్ఫూర్తితోనే బాపట్ల సేవా సేతును ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి రాధా మాధవి, ఐసిడిఎస్ సిడిపివోలు, అంగన్వాడి సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker