chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala Local News :చీరాలలో జె.ఎన్.టి.యు.కె ఇంటర్ కాలేజ్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్ ప్రారంభం

చీరాల, ఫిబ్రవరి 2 (2026):-చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో జె.ఎన్.టి.యు కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ మరియు బాడీ బిల్డింగ్ టోర్నమెంట్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌తో పాటు యూనివర్సిటీ టీం సెలక్షన్స్ కూడా నిర్వహిస్తున్నారు.

Chirala Local News :చీరాలలో జె.ఎన్.టి.యు.కె ఇంటర్ కాలేజ్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్ ప్రారంభం

పవర్ లిఫ్టింగ్ (పురుషులు, స్త్రీలు), వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు, స్త్రీలు) మరియు బాడీ బిల్డింగ్ (పురుషులు) విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. కార్యక్రమాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీశ్ బాబు మాట్లాడుతూ, శారీరక ఆరోగ్యం మెరుగుపడితే మానసిక ఆరోగ్యం కూడా బలపడుతుందని తెలిపారు. క్రీడలు విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి కీలకంగా నిలుస్తాయని అన్నారు.

ప్రధాన అతిథిగా హాజరైన వేటపాలెం సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. జనార్ధన్ మాట్లాడుతూ, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని సూచించారు. పవర్ లిఫ్టింగ్ వంటి క్రీడలు శరీర దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

Chirala Local News :చీరాలలో జె.ఎన్.టి.యు.కె ఇంటర్ కాలేజ్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్ ప్రారంభం

ఈ టోర్నమెంట్‌కు జె.ఎన్.టి.యు కాకినాడ పరిధిలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పాల్గొన్న క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు, జె.ఎన్.టి.యు.కె స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడు అన్నం శ్రీనివాసరావు తెలిపారు.

జె.ఎన్.టి.యు.కె స్పోర్ట్స్ కౌన్సిల్ తరఫున డా. శ్యాం కుమార్ పరిశీలకులుగా హాజరయ్యారని వెల్లడించారు.Chirala Local News

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డా. సి. సుబ్బారావు (అక్రిడిటేషన్), డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) వనమా దొర నాగ సాయినాద్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి. రమణమూర్తి, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker