chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local News :బంగారు కుటుంబం పథకం కింద నిరుద్యోగ యువతకు ఉచితంగా జీఎస్టీ (GST) ఫైలింగ్ శిక్షణ

విజయవాడ, ఫిబ్రవరి 3 (2026):-నిరుద్యోగ యువతకు ఉచితంగా జీఎస్టీ (GST) ఫైలింగ్ శిక్షణ అందించేందుకు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ (SAPF) మరియు ఆంధ్రప్రదేశ్ టాక్స్ బార్ అసోసియేషన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వ ‘జీరో పావర్టీ – P4’ (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టనర్‌షిప్) కార్యక్రమంలో భాగంగా, ‘బంగారు కుటుంబం’ పథకం కింద ఈ శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

మంగళవారం లైలా కాలేజ్ ఆడిటోరియం ఎదురుగా ఉన్న వెంకటేశ్వర కాలనీలోని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు సమక్షంలో SAPF సీఈఓ జె. విజయలక్ష్మి, ఏపీ టాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా చెరుకూరి కుటుంబరావు మాట్లాడుతూ, జీఎస్టీ ఫైలింగ్‌పై ఒక నెల రోజుల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు లేదా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువత ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.

శిక్షణ అనంతరం అభ్యర్థులు వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన నెలవారీ జీఎస్టీ రిటర్నులను ఫైల్ చేస్తూ స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.Vijayawada Localnews

ఈ కార్యక్రమంలో ఏపీ టాక్స్ బార్ అసోసియేషన్ సెక్రటరీ సురేష్ కుమార్, ట్రెజరర్ ఫణి కుమార్, జీఎస్టీ ట్రైనర్ చక్ర రమణతో పాటు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker